బెల్లంపల్లి, మార్చి 11 : వస్తువుల కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు సూచించే బీఐఎస్పై అవగాహన ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) ప్రతినిధులు కవిలత, జయశ్రీ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారాలు, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థు ల క్లబ్లను ఏర్పాటు చేసి రాత పరీక్ష నిర్వహించా రు. ఇందులో విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందించారు. ఈఈఈ విభాగం విద్యార్థులు ఎక్కువ బహుమతులు సాధించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ దేవేందర్ రెడ్డి, బీఐఎస్ మెంటార్ యాదయ్య, లెక్చరర్లు రాములు, సురేశ్, రాజమల్లు, శివ ప్రసాద్, రవళి, శంకర్, నాగరాజు, శ్రీకాంత్, హర్ష, శ్రీనివాస్, మాలతి, వెంకటస్వామి పాల్గొన్నారు.