కడెం, జూన్ 16 : జాతీయ అవార్డు వచ్చేలా గ్రామాన్ని తీర్చిదిద్దాలని సర్పంచ్ బొడ్డు గంగన్నను నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో వంట కోసం నిర్మించిన గోబర్ గ్యాస్ షెడ్డును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకుల పాఠశాలలో నిర్మించిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ను పరిశీలించారు.
గురుకుల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూసి సర్పంచ్ బొడ్డు గంగన్నను అభినందించారు. జాతీయ అవార్డు వచ్చేలా కృషి చేయాలని, తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట సర్పంచ్ బొడ్డు గంగన్న, తహసీల్దార్ చిన్నయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో ఉపేందర్, ఏపీవో జయదేవ్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, పాఠశాల ఉపాధ్యాయుడు ప్రతాప్, టీఏలు కాంతారావు, గణేశ్, సుభాష్, ఎఫ్ఏ కమలాకర్, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.