నస్పూర్, అక్టోబర్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్వీ ఫైర్ అయ్యింది. ఈ మేరకు బుధవారం హలో విద్యార్థి-చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌ను ముట్టడించి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సరి కాదని, కాంట్రాక్టు పనులు చేసిన తమ మంత్రులకు బిల్లులు ఎప్పటికప్పుడు క్లీయర్ చేస్తూ.. విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్‌పై నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యారంగం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, నియోజకవర్గ అధ్యక్షుడు దగ్గుల మధుకర్, నాయకులు మహమ్మద్ సాజిద్ చోటు, నక్క తిరుపతి, లక్ష్మీకాంత్, చంద్రకిరణ్, సతీశ్, రాజేందర్, సంతోశ్, గోపాల్, శ్రీకాంత్, రాజ్‌కుమార్, శివ, అజయ్ పాల్గొన్నారు.