Adilabad | ఉట్నూర్ రూరల్, జూన్ 14 : మండలం లాల్ టేకిడి గల గురుకుల జూనియర్ కళాశాలకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా ఉట్నూర్ విద్యుత్ శాఖ అధికారులకు బిఆర్ఎస్ నాయకులతో కలిసి వినతి పత్రం అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తరచు ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండడంతో కళాశాలలో చదువుతున్న విధ్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. విద్యుత్ లేకపోవడంతో నీళ్ళు రాక స్నానం చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రి సమయంలో విద్యుత్ లేకపోవడం విష పురుగులు తిరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కావున విద్యుత్ సమస్య ఏర్పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొళ సత్తన్న, సాజిద్, జాడి వెంకటేష్, జయ చంద్ర, అన్వేష్, సూర్య కాంత్ తదితరులు పాల్గొన్నారు.