సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 12: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన సూపర్ సక్సెస్ అయింది. గూడెం చెక్‌పోస్టు నుంచి భారీ కాన్వాయ్‌తో గుడిపేట మెడికల్ కళాశాల భవనం వద్దకు చేరుకోగానే, ఆయనకు పార్టీ శ్రేణు లు, అభిమానులు కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. నస్పూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి రాగానే ఫొటోలు దిగడానికి, శాలువాలు కప్పడానికి, వినతిపత్రాలు అందజేయడానికి పోటీ పడ్డారు. ఆయన ప్రసంగం ప్రారంభం కాగానే కార్యకర్తలంతా ముందుకు తోసుకుంటూ వచ్చారు. సెల్ఫోన్లలో కేటీఆర్ ప్రసంగాన్ని చిత్రీకరించడానికి పోటీ పడ్డారు.
కేటీఆర్ మాట్లాడినంతా సేపు జై కేటీఆర్ నినాదాలతో హోరెత్తించారు. చప్పట్లు, ఈలలు, నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ‘సేవ్ సింగరేణి.. మెడికల్ బోర్డు పునఃరుద్ధరించాలి.. మారుపేర్ల సమస్య పరిష్కరించాలి’.. అంటూ సింగరేణి కార్మికులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఆపై కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. కేసీఆర్ ఇచ్చిన కా రుణ్య నియామకాలు రద్దు చేయడానికి, విజిలెన్స్ విచారణ పేరుతో మెడికల్ బోర్డు పెట్టడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, మీరే కాపాడాలని వేడుకున్నారు. కేసీఆర్ మాటలు వినకుండా కాంగ్రెస్ బూటకపు మాటలు నమ్మి గెలిపిస్తే చివరకు కార్మికులకు అన్యాయం చేస్తున్నదని కేటీఆర్ అనడంతో.. కాంగ్రెస్‌కు మరోసారి ఓటు వేయమని, వారిని నమ్మి మోసపోయామని నినదించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే మళ్లీ సింగరేణికి పూర్వవైభవం వస్తుందని, కారుణ్య నియామాకాలు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.
మీ తెగువ అందరికీ ఆదర్శం..
మంత్రి ఇలాకాలో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని దక్కించుకోవడానికి సీపీఐ పార్టీతో మిత్రపక్షంగా ఏర్పడి కాంగ్రెస్‌తో తెగించి 51 రోజుల పాటు కొట్లాడారని, చివరకు క్యాతన్‌పల్లి పీఠాన్ని దక్కించుకున్నారని, ఇందుకు గర్వంగా ఉందని, మీ తెగువ ఆదర్శంగా నిలుస్తోదని కేటీఆర్ కొనియాడారు. ఇందుకోసం బాల్క సుమన్ 16 రోజులు జైలుకు వెళ్లి వచ్చాడని, తాను జైలులో బాల్క సుమన్‌ను కలిసినప్పుడు ఎన్నిరోజులైనా జైల్లో ఉంటాను కానీ, పార్టీ కౌన్సిలర్లకు, మిత్రపక్షమైన సీపీఐ కౌన్సిలర్లకు అండగా ఉండాలని తనను కోరాడని కేటీఆర్ గుర్తుచేశారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని కోట్లు ఇస్తామని చెప్పినా ప్రలోభాలకు గురిచేసినా.. లొంగకుండా పార్టీకి కట్టుబడి నిలిచిన కౌన్సిలర్లను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు పార్టీ కౌన్సిలర్లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించారు. క్యాతన్‌పల్లి పీఠం దక్కించుకోవడానికి జైలుకు వెళ్లి వచ్చి, చివరి వరకు కొట్లాడిన చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డిని ఆయన శాలువాలతో సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రం లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావ డం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభు త్వం అరాచకాలు చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ తీసుకువచ్చిన కారుణ్య ని యామకాలను రద్దు చేయడానికి ప్రభు త్వం కుట్ర పన్నిందని, ఇందులో భాగంగానే కారుణ్యం ద్వారా ఉద్యోగాలు కల్పించిన వారిపై విజిలెన్స్ విచారణ చేపట్టిందన్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలేదని మండిపడ్డారు.
అభివృద్ధి అంటేనే కేసీఆర్ : సుమన్
అభివృద్ధి అంటే అందరికీ కేసీఆర్ గుర్తుకు వస్తారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నా రు. కాంగ్రెస్ అధికార బలంతో ప్రశ్నించే వారి గొంతు నొక్కి, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తుందన్నారు. కేసులు తమకు కొత్త కాదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో క్యాతన్‌పల్లిలో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు తనపై, తమ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మంత్రి గా ఉండి వివేక్‌కు చెన్నూర్ నియోజకవర్గానికి చేసిందేమీలేదన్నారు. ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, పట్టణ అధ్యక్షుడు సుబ్బ య్య, మాజీ అధ్యక్షుడు వంగ తిరుపతి, డాక్టర్ రాజారమేశ్ పాల్గొన్నారు.