మంచిర్యాల, జూన్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మొదలుపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సభ్య త్వ నమోదు, సర్(స్పెషల్ ఇంటెన్సిన్ రివిజన్)పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సభ్యత్వ నమోదు కోసం యాప్‌ను తీసుకొస్తున్నామన్నారు. కేసీఆర్ సీఎం కావాలంటే మీ నియోజకవర్గంలోని 303 బూతుల్లో మనమే కేసీఆర్ లెక తిరగాలని, మనమే సభ్యత్వ నమోదు చేయాలన్నారు. అప్పుడే ఈ కాంగ్రెస్, బీజేపీలను పాతరేసి కేసీఆర్ ప్ర భుత్వాన్ని తీసుకురాగలమని చెప్పారు.
మీ బూత్‌స్థా యి నాయకుల్లో ఉన్న జోష్ చూస్తుంటే.. మీరు స్టేట్‌లోనే నంబర్ వన్‌గా ఉంటారని అనిపిస్తుందన్నారు. బోథ్ నియోజకవర్గంలో ఎకడపోయినా.. మామూలుగా జోష్ లేదన్నారు. ఒకొక బూత్‌లో ఇద్దరిద్దరు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తామని, ఆ యాప్ ఎట్లా.. వినియోగించాలో చెప్తామన్నారు. మీ బూత్‌లో ఉండే ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చినాక, ఆ బూత్‌లో ఉండే లిస్టు మీ చేతికి వస్తుందన్నారు. పకడ్బందీగా సభ్యత్వ నమోదు చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 25వ తారీకు నుంచి మొదలయ్యే ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎవరైనా కొత్తవాళ్లు 18 ఏండ్లు నిండినవాళ్లు ఉంటే వాళ్ల పేరు రాపించాలని, చనిపోయిన వాళ్ల పేర్లు ఉంటే వాళ్ల పేర్లు తీసేయించాలన్నారు. ఎవరికన్నా రెండు, మూడు ఓట్లు ఉంటే వాళ్లకు ఒకటే ఓటు ఉండేలా చూసుకోవాలన్నారు.

ఓటర్ల మ్యాపింగ్, ఓటర్ల నమోదు కోసం మన బూత్ లెవల్ ఏజెంట్లు అధికారులతో ఇంటింటికీ వెళ్లాలన్నారు. ఒక బూతులో 1000 ఓట్లు ఉంటే 300 నుంచి 350 ఇళ్లు ఉంటాయని.. ఈ నెల రోజులు మొత్తం 1000 ఓట్లను కవర్ చేయాలని సూచించారు. సర్ కార్యక్రమంలో ఎప్పుడు ఏం చేయాలన్న దానిపై సమావేశానికి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు పలు సూచనలు చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ మంత్రులు జోగు రామన్న, ప్రశాంత్‌రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ముథోల్ ఇన్చార్జిలు విలాస్ గాదేవార్, శ్యాంసుందర్, కిరణ్ కొమ్రేవార్, చిన్నన్రావు పాల్గొన్నారు.