ఆసిఫాబాద్ టౌన్, డిసెంబర్ 15 : మూడో విడుత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీదే హవా ఉంటుందని, అత్యధిక సంఖ్యలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో తొలి విడుత ఎన్నికల్లో విజయం సాధించిన జైనూర్, సిర్పూర్(యు) మండలాల సర్పంచులను శాలువాలతో ఘనంగా సతరించారు. ఆమె మాట్లాడుతూ మొదటి, రెండు విడుతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ను ఆశీర్వదించారని, మూడు విడుత ఎన్నికల్లోనూ తమ పార్టీకే పట్టం కడుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
రెబ్బెన, డిసెంబర్ 15 : రెబ్బెన మండలం ఖై ర్గాం, గంగాపూర్, లక్ష్మీపూర్, నంబాల, ఖైర్గూడ పంచాయతీలకు జరుగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ముంజం రూపేశ్వర్, నగోష విలాస్, కోలే శ్యాంరావు, దుర్గం కమలాబాయి, ఎర్రవేణి వెంకటేశ్‌లతో పాటు వార్డు మెంబర్ అభ్య0ర్థులందరినీ గెలిపించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.