మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెన్షన్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నిరసనలతో హోరెత్తించాయి. అసెంబ్లీ సాక్షిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశాయి.
మంచిర్యాలటౌన్, మార్చి 14: మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కలగజేసుకుని బీఆర్ఎస్ నాయకులను పక్కకు తప్పించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, రాష్ట్ర నాయకుడు గోగుల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ పాలన చేతగాక సీఎం ప్రతిపక్ష నాయకులపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని, స్ట్రెచర్, మార్చురీ అంటూ పిచ్చికూతలు కూస్తూ సీఎం పదవిని అపహాస్యం చేస్తున్నాడని మండిపడ్డారు.
ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక ప్రతిపక్ష నాయకులపై కక్షగట్టడం.. ప్రజలను పక్కదారి పట్టించడంలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ఏకైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని, ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యంకాని హామీలను ఇచ్చారని, అవి నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే వాటిని అమలు చేయడం లేదని వారు విమర్శించారు. శాసనసభలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తారన్న కారణంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు తోట తిరుపతి, వెంకటేశ్వర్రావు, ఎర్రం తిరుపతి, మంతెన గట్టయ్య, కాటం రాజు, పడాల రవీందర్, కర్రు శంకర్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి, మార్చి 14 : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతునొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై మాత్రమే జగదీశ్‌రెడ్డి మాట్లాడారని పేర్కొన్నారు. ఆయనను అసెంబ్లీ సెషన్ నుంచి సస్పెన్షన్ చేయడం పిరికిపంద చర్య అన్నారు. బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సబ్బని అరుణ్ కుమార్, నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, కాంపల్లి రాజం, ఆలీ, రాములు, ధర్మేందర్, సందీప్, చంద్రశేఖర్, గోగర్ల సత్యనారాయణ, రంగ మహేశ్, దాగం చరణ్, గుమ్మడి కృష్ణంరాజు, శ్రీనాథ్, దుర్గం రవి, సతీశ్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, మార్చి 14 : జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సభ నియమాల ప్రకారం నడుచుకున్నారని, ఎవరిని దూషించలేదన్నారు. సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి సింగిల్ విండో చైర్మన్లు అలీ బిన్ అహ్మద్ సంజీవ్, పెంటు, మండల అధ్యక్షులు జాబొరె రవీందర్, శ్రీధర్, అజయ్ మాజీ సర్పంచులు, ఎంపీపీలు తదితరులు ఉన్నారు.
లక్షెట్టిపేట, మార్చి 14 : పట్టణంల్నో ఉతూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మున్సిపాలిటీ మాజీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ తిప్పని లింగయ్య, అన్వర్‌ఖాన్, ఓరగంటి శ్రీకాంత్, షేక్ చాంద్ పాల్గొన్నారు.
చెన్నూర్, మార్చి 14 : పట్టణంలోని బస్టాండ్‌లో కాంగ్రెస్‌పార్టీ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహణం చేశారు. నిరసనల నేపథ్యంలో ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులను మోహరించారు. బీఆర్ఎస్ నాయకులు గ్రూపులుగా విడిపోయి, పోలీసుల నుంచి తప్పించుకొని బస్టాండ్‌లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు రాజారమేశ్, మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి, మాజీ కౌన్సిలర్ రేవెల్లి మహేశ్, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, కోటపల్లి సింగల్ విండో చైర్మన్ సాంబగౌడ్, నాయకులు విద్యాసాగర్, జడల మల్లేశ్, తిరుపతి సురేశ్, తగరం చిరంజీవి, రేవెల్లి సతీశ్, నయాబ్, తగరం అశోక్, రేణిగుంట శ్రీనివాస్, బోగె భారతి, మహేశ్ పాల్గొన్నారు.