నేడు బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా గురువారం సిర్పూర్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని కాగజ్‌నగర్‌లో నిర్వహించనుంది.
- కాగజ్‌నగర్‌లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు
- సమన్వయకర్త ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యంలో నిర్వహణ
- పార్టీలో పెద్ద ఎత్తున బీఎస్పీ కార్యకర్తల చేరికకు రంగం సిద్ధం
- హాజరుకానున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా గురువారం సిర్పూర్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని కాగజ్‌నగర్‌లో నిర్వహించనుంది. సిర్పూర్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ మంత్రి జోగురామన్న, ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సక్కు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలోనే బీఎస్పీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరనున్నారు.
3 వేల మందితో సన్నాహక సమావేశం…
కాగజ్‌నగర్‌లోని సంతోష్ ఫంక్షన్ హాల్లో సుమారు 3 వేల మంది పార్టీ కార్యకర్తలతో ఈ సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇటీవల బీఆర్ఎస్లో చేరిన తరువాత నియోజకవర్గంలో రాజకీయంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సన్నాహక సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి అనుగుణంగా భోజన వసతి కల్పించనున్నారు. సమాశాన్ని విజయవంతం చేసేందుకు శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
విజయవంతం చేయాలి
కాగజ్‌నగర్‌లో నిర్వహించనున్న సిర్పూర్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమాశాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి. సుమారు 3 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. గ్రామస్తాయి నుంచి కార్యకర్తలు పాల్గొంటారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరబోతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం.
-దండె విఠల్, ఎమ్మెల్సీ, సమన్వయ కర్త
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

