నిర్మల్ అర్బన్, జూన్ 15 : నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము పుట్టిన రోజు సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జన్మదినం సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.