దస్తురాబాద్, ఏప్రిల్ 12 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయంతం చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. చెన్నూర్ గ్రామంలో శనివారం నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు రజతోత్సవానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 27న వరంగల్ నిర్వహించే భారీ బహిరంగ సభకు తరలిరావాలని అన్నారు. గ్రామాల్లో జెండా గద్దెలను తయారు చేయాలని పిలుపు నిచ్చారు. అంతకుముందు గ్రామంలోని హనుమాన్ ఆలయ వార్షికోత్సవ, హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నాయకులు దాసరి సుధాకర్, మాణిక్రావు, శ్రీనివాస్, కుమార్, రవీందర్, రాజేందర్ ఉన్నారు.