బోథ్, అక్టోబర్ 26: అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి పేర్కొన్నారు. గురువారం బోథ్‌లో, జీడిపల్లె గ్రామాల్లో వేర్వేరుగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను అమలు చేసి చూపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రూ 400లకే సిలిండర్, మహిళలకు బీమా, సన్నబియ్యం, పింఛన్ల పెంపు, రైతుబంధు పెంపు వంటి పథకాలను మ్యానిఫెస్టోలో చేర్చారని వివరించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, ఆత్మ చైర్మన్ ఎం సుభాష్, ప్రవీణ్, ఎలుక రాజు, సోలంకి సత్యనారాయణ, సురేందర్‌యాదవ్, మండాడి శేఖన్న, చంద్రమోహన్, మహిపాల్, జుగదిరావ్, విజయ్, భీముడు పాల్గొన్నారు.
ఇచ్చోడ, అక్టోబర్ 26 : రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసాగా నిలుస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. గురువారం మండలంలోని మాల్యాల్, యాపల్‌గూడ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతమ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ముండే పాండురంగ్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, మాజీ కన్వీనర్ మేరాజ్ అహ్మద్, సర్పంచ్ రాజు, బీఆర్ఎస్ నాయకులు సాబీర్, మాతిన్, సర్పంచ్ సుభాష్ పాటిల్, మాజీ జడ్పీటీసీ కృష్ణకుమార్, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ దయాకర్ రెడ్డి, గోనె లక్ష్మి, పాండురంగ్, గంగాధర్, గణేశ్, అస్లాం, నాయకులు పాల్గొన్నారు.
సొనాల, అక్టోబర్ 26 : సొనాల మండలంలోని టీవీటీ, పార్డి(బీ), బజార్కేశవ్గూడ గ్రామాల్లో ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. జాదవ్ అనిల్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సురేందర్ యాదవ్, కదం ప్రశాంత్, అల్లకొండ ప్రశాంత్, సర్పంచ్, ఎంపీటీసీలు, రైతులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
నేరడిగొండ, అక్టోబర్ 26 : తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని పార్టీ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లే నానక్‌సింగ్ అన్నారు. గురువారం మండలంలోని లింగట్ల, గోండుగూడ, ఆరెపల్లి గ్రామాల్లో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జాదవ్ అనిల్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ ఎలేటి రవీందర్‌రెడ్డి, సర్పంచ్ విశాల్ కుమార్, నాయకులు గాదె శంకర్, చంద్రశేఖర్ యాదవ్, లచ్చన్న, సురేందర్, నారాయణ, రాజేశ్వర్, ఆత్రం భీంరావ్, హనుమయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, అక్టోబర్ 26 : మండలంలోని చింతకర్ర, అందుగూడ, కొత్తగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలు ఇంటింటికీ అందుతున్నాయని ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉండాలని కోరుతూ రచ్చబండ కార్యక్రమంలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు రమణ, చైతన్య, మహేందర్, శేఖర్, భోజన్న, మధుకర్, రమేశ్, మల్లేశ్, సాయన్న, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పటేళ్లు పాల్గొన్నారు.