సీసీసీ నస్పూర్, మే 11: పార్లమెంట్ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్‌కు అండగా నిలవాలని ఎంపీ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్‌లో ఆయన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గనులపై ప్రచారం సందర్భంగా కార్మికుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సింగరేణి కార్మికులకు అనేక హక్కులు కల్పించారని వివరించారు.
ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా ప్రజలంతా కోటీశ్వరుడైనా కాంగ్రెస్ అభ్యర్ధికి గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్‌కుమార్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, టీబీజీకేఎస్ నాయకులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, పెట్టం లక్ష్మణ్, బండి రమేశ్, పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సుధాకర్, జక్కుల రాజేశం, గుంట జగ్గయ్య, తదితరులు పాల్గొన్నారు.