మా తండా ఓట్లు బీఆర్ఎస్కే
ఈ సారి తండా వాసులమంతా కారు గుర్తుకే ఓటు వేస్తామని వేరే పార్టీలకు అవకాశం ఇవ్వబోమని మెదన్‌పూర్ తండా వాసులు ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. సూర్యపూర్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీ విఠల్ రెడ్డి గురువారం మెదన్‌పూర్ తండాలో పర్యటించా రు.
- ఎమ్మెల్యే సమక్షంలో మెదన్‌పూర్ తండా వాసుల ప్రతిజ్ఞ
కుంటాల, అక్టోబర్ 26 : ఈ సారి తండా వాసులమంతా కారు గుర్తుకే ఓటు వేస్తామని వేరే పార్టీలకు అవకాశం ఇవ్వబోమని మెదన్‌పూర్ తండా వాసులు ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. సూర్యపూర్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీ విఠల్ రెడ్డి గురువారం మెదన్‌పూర్ తండాలో పర్యటించా రు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. గ్రామ సర్పంచ్, స్థానిక బీజేపీ నాయకుల నిర్లక్ష్యం వల్ల తండా అభివృద్ధి చెందడం లేదని, తమను పట్టిం చుకోవడం లేదని తండావాసులు ఎమ్మెల్యే తో వాపోయారు.
కేసీఆర్ సార్ అమలు చేస్తున్న రైతు బంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, పోడు పట్టాలు లాంటి పథకాలతో తాము లబ్ధి పొందా మని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో ఓలాలో మహిళలతో కలిసి విఠల్ రెడ్డి బతుకమ్మ సంబురా ల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, నాయకులు తూర్పాటి వెంకటేశ్, సర్పంచ్‌లు ఖనీష్ ఫాతిమా, దొనికెన వెంకటేశ్, హైమద్ పాషా, చౌహాన్ రాజు, రాజలింగు, వెంకట్ రావు పటేల్, కార్యకర్తలు ఉన్నారు.

బీఆర్ఎస్లో బీజేపీ నాయకుల చేరిక
కుంటాల, అక్టోబర్ 26 : సూర్యాపూర్ గ్రామం లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బీజేపీ నాయకులకు కండువా కప్పి సాదా రంగా పార్టీలోకి ఆహ్వానించారు. సూర్యాపూర్ మాజీ ఎంపీటీసీ పెద్దింటి పోశెట్టి, నేరెళ్ల రమేశ్, కుభీర్ సురేశ్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తా మని పేర్కొన్నారు. సర్పంచ్ బక్కి సునీత బోజన్న, భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీ కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కాంగ్రెస్ అడ్డదారి తొక్కుతున్నది..
రైతులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ అడ్డదారి తొక్కుతున్న దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి ఆరో పించారు. రైతు బంధు పెట్టుబడి పైసలు రైతుల ఖాతాల్లో జమచేయవద్దని, ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను కార్యకర్తలతో కలిసి దహనం చేశా రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

