తాంసి, నవంబర్ 13 : కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్న పథకాలు బూటకమని, సాధ్యం కాని హామీలను ప్రజలు నమ్మొదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం మండలంలోని వామన్‌నగర్, అంబుగాం, గిరిగామ, లింగూడ, అట్నంగూడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గుస్సాడీ నృత్యాలతో ఎమ్మెల్యే అభ్యర్థికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ సీఎంగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీలు కుమ్ర సుధాకర్, తాటిపల్లి రాజు, ఎంపీపీ మంజులాశ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, ఓయూ జేఏసీ నాయకులు ఏల్చల దత్తాత్రేయ, సర్పంచ్‌లు స్వప్న రత్న ప్రకాశ్, సదానందం, వెంకన్న, తూర్పుబాయి యశ్వంత్, అండె అశోక్, అలాలి జ్యోతీనర్సింగ్, బీఆర్ఎస్ నాయకులు ధన్‌రాజ్, లింగారెడ్డి, వెంకట రమణ, దేవేందర్, అరుణ్, రజినీకాంత్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ గోవర్ధన్ రెడ్డి, విలాస్, గడుగు గంగన్న, సంజీవ్, పరమేశ్, చంద్రయ్య, మల్లయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదరించి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
నేరడిగొండ, నవంబర్ 13 : ఒక్కసారి ఆదరించి గెలిపించి చూడండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. ఆదివారం మండలంలోని తేజాపూర్, బుద్దికొండ, రాజులతండా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో ఆయనకు స్వాగతం పలికారు. గ్రామాల్లో ఆయన మద్దతుగా నిలుస్తామని ప్రజలు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, ఎంపీపీ రాథోడ్ సజన్, సీనియర్ నాయకులు గడ్డం భీంరెడ్డి, శంకర్, సయ్యద్ జహీర్, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లే నానక్‌సింగ్, వీడీసీ చైర్మన్ ఏలేటి రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు పెంట వెంకటరమణ, విశాల్‌కుమార్, రాజుయాదవ్, ఎంపీటీసీ అంబేకరి పండరి, ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, నాయకులు పద్మనాభరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పోతారెడ్డి, మహేందర్‌రెడ్డి, లక్ష్మణ్, మధుకర్, మురళిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ అన్నెల నారాయణ, సుజిల్, నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
నేరడిగొండ, నవంబర్ 13 : మండలంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు, బుద్దికొండ మాజీ సర్పంచ్ అన్నెల నారాయణ, బీజేపీ నాయకులు ఆడె చంపత్, పవార్ అనిల్, విమల్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జాదవ్ అనిల్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, సురేందర్ పాల్గొన్నారు.
ఆశీర్వదించండి..సేవ చేసే అవకాశం కల్పించండి
గుడిహత్నూర్, నవంబర్ 13 : ఆశీర్వదించండి.. కారు గుర్తుకు ఓటు వేసి బోథ్ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించండని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్, కొలాంగూడ ఏర్పాటు చేసిన దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.అన్ని వర్గాల ప్రజల సంతోషమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాథోడ్ ప్రతాప్, ఆడె గుణవంత్‌రావ్, ఆడె శీల, కుమ్ర శంభు, జాదవ్ రమేశ్, రంగు శ్రీనివాస్‌గౌడ్, జమీల్, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
భీంపూర్, నవంబర్13: మండలంలోని గుంజాల గ్రామానికి చెందిన 15 మంది బీజేపీ గిరిజన యువకులు సోమవారం నేరడిగొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్‌జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంజీవ్‌రెడ్డి , శంకర్, దండే విఠల్, అనిల్ పాల్గొన్నారు.
దేవాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ
తాంసి(తలమడుగు), నవంబర్ 13: తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ కోఆప్షన్ సభ్యుడు సలీం, నరేందర్ రెడ్డి, రమేశ్, ప్రభాకర్, నారాయణ, అడెల్లు, ఊశన్నకు జాదవ్ అనిల్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ అబ్దుల్లా, బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు దత్తాత్రేయ, ఆర్ఎస్ఎస్ జీవన్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.