ఇచ్చోడ(సిరికొండ), నవంబర్ 20: బోథ్‌ను ఆదర్శంగా తీ ర్చిదిద్దుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అ న్నారు. సిరికొండ మండలకేంద్రంలో బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ సోమవారం ఇం టింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే, చిన్మన్ ప్రాజెక్టును మళ్లీ రీ డిజైన్ చేయించి, మండలాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించి, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇచ్చోడ నుంచి ఇంద్రవెల్లి వరకు డబుల్ రోడ్డు వేయిస్తానని హామీనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సర్పంచ్ పెంటన్న, ఉప సర్పంచ్ చందు, నాయకులు రాజన్న, పాల్గొన్నారు.
బోథ్, నవంబర్ 20: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే విజయానికి సోపానాలు అని జడ్పీటీసీ సంధ్యారాణి అన్నారు. మండలకేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అంశాలను వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్‌ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండలకేంద్రంలోని గులజార్ కాలనీలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించా రు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. కారు గుర్తుకు ఓటేసి అనిల్ జాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు అల్లాకొండ ప్రశాంత్, ఎండీ ఇమ్రాన్, పొచ్చెర ఎంపీటీసీ, బొడ్డు శ్రీనివాస్, సలీం, రఫీ, ఆటో మల్లేశ్, ఆన్సర్, సాబీర్, అక్రమ్, ఓలీద్దీన్, ఇర్ఫాన్, ఇమ్రాన్ పాల్గొన్నారు.
తాంసి, నవంబర్ 20: మోసకారి కాంగ్రెస్‌ను నమ్మొద్దని, నమ్మి ఓటేస్తే అధోగతి తప్పదని జడ్పీటీసీ తాటిపల్లి రాజు హె చ్చరించారు. సోమవారం పొన్నారి గ్రామంలో బీఆర్ఎస్ నా యకులు వన్నెల అశోక్‌తో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టా రు. బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీపీ ముచ్చ రేఖారఘు, సర్పంచ్‌లు అండె అశోక్, అలాలి జ్యోతి, నర్సిం గ్, సదానందం, వెంకన్న, తూర్పుబాయి యశ్వంత్, కుంట సరిత కేశవ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, లక్ష్మీపతి, చంద్రయ్య, మహేందర్, కాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కీర్తి అరుణ్‌కుమార్, రజినీకాంత్ రెడ్డి, వెంకట రమణ, రాంచందర్ రెడ్డి, సిరిగిరి దేవేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు దయానంద్, పాల్గొన్నారు.
తాంసి(తలమడుగు), నవంబర్ 20: తలమడుగు మండలంలోని ఉండం గ్రామానికి చెందిన యువకులు మాజీ ఎం పీ గొడాం నగేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి మాజీ ఎంపీ ఆహ్వానించారు. పార్టీలో చేరిన జమాల్, నర్సింహు లు, షారూఖ్, నసీర్, సలీం, అక్రమ్, మహబూబ్, మహ్మ ద్ సల్మాన్, కలీం, అఫ్రిద్, ప్రశాంత్, ఆసిఫ్, అశ్వక్, రహీం మౌలానా, తదితరులు చేరారు. కార్యక్రమంలో సీనియర్ జిల్లా నాయకులు కనపర్తి చంద్రకాంత్, మాజీ జడ్పీటీసీ జక్కుల ప్రభాకర్, బొండ్ల వెంకటస్వామి, మాజీ వైస్ ఎంపీపీ స్వామి పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలో కూ బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి అనిల్ జాదవ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ వెలుగు చంటి, కార్యకర్తలు పాల్గొన్నారు.
సొనాల,నవంబర్ 20: సొనాల మండలంలోని పార్డి-(కె), గొల్లాపూర్ గ్రామాల్లో సోమవారం బీఆర్ఎస్ నాయకులు గ డప గడపకూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్‌తో పాటు అనేక పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అందుకు అనిల్‌జాదవ్‌ను భారీ మెజారీటీతో గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మణ్ సింగ్, సొనాల బీఆర్ఎస్ కమిటీ అధ్యక్షులు సోమన్న, ఏఎంసీ డైరెక్టర్ అమృత్ రావ్, రాథోడ్ రాయలు, పూనమ్ సింగ్, కరణ్ సింగ్, విజయ్ సిం గ్, రాం చందర్, రవీందర్, సోన్ సింగ్ పాల్గొన్నారు.
బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్, ఎంపీపీ తుల శ్రీనివాస్ సమక్షంలో సొనాల మండలంలోని దేవుల్ నాయక్ తండా గ్రామ ఉప సర్పంచ్ రాథోడ్ ప్రశాంత్‌తో పా టు రాథోడ్ సచిన్, రాథోడ్ సురేశ్, ఆడె సునీల్, ఆడె శేఖర్, రాథోడ్ దిలీప్, రాథోడ్ వినోద్, రాథోడ్ వకీల్ బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం సాయంత్రం నేరడిగొండలోని తన నివాసంలో జాదవ్ అనిల్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నాయకులు అభిలాష్, సుధీర్ రెడ్డి, హరీష్, జా దవ్ కృష్ణ, జాదవ్ బాబులాల్, రాథోడ్ ప్రదీప్, జాదవ్ ము కుంద్, రాథోడ్ భీంరావ్, సకారం, రోహిదాస్ పాల్గొన్నారు. బజార్హత్నూర్, నవంబర్ 20: మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. యువజన సంఘం అధ్యక్షుడు డుబ్బుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. నాయకు లు జనార్దన్, సురేశ్, పాండురంగ్, వినోద్, సుకుమార్, తదితరులున్నారు.