కోటపల్లి/సీసీసీ నస్పూర్/బెల్లంపల్లి/ భీమారం/జన్నారం, సెప్టెంబర్ 13 : రాష్ట్రం లో బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపుమేరకు హైదరాబాద్ బయల్దేరుతున్న నాయకులను పోలీసులు ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి అరె స్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇ లాంటి అక్రమ అరెస్టులు హేయమైన చర్య అని, తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ, అతని గూండాలను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఆపలేరని, తెలంగాణ ఉద్యమంలో సైతం అక్రమ అరెస్ట్‌లు చేస్తే ఇవ్వేత్తున ఎగిసిపడ్డారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడులకు దిగిన గాంధీతో పాటు, కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు.
కోటపల్లిలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, మండల యూత్ అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్, నాయకులు ఆసంపల్లి సంపత్, ఆసరెల్లి నూతన్, అసంపల్లి అనిల్, కొండ సంతోష్‌ను గురువారం రాత్రి పోలీసులు స్టేషన్‌కు తరలించారు. సీసీసీ నస్పూర్‌లో బీఆర్ఎస్వీ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు దగ్గుల మధుకుమార్, బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు కాటం రాజు, పట్టణ ఉపాధ్యక్షుడు కందుల ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి మహ్మద్ సాజిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై వదిలిపెట్టారు. బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులు కొత్తబస్టాండ్ ఏరియాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు సబ్బని అరుణ్‌కుమార్ అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తాళ్లగురిజాల పోలీసులు బెల్లంపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ గుర్రాల రాయమల్లు, యూత్ నాయకులు కాంపెల్లి విశాల్, గంధం తిరుపతి యాదవ్, శేఖర్ మందుస్తు అరెస్ట్ చేశారు. భీమారం పోలీసులు పార్టీ మండలాధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్, సీనియర్ నాయకులు దాసరి మధునయ్య, ఆత్కూరి రాము, పానుగంటి లచ్చన్న, నాయకులు జలంపల్లి తిరుపతి, భూక్యా రాజ్ కుమార్ నాయక్‌ను అరెస్టు చేశారు.
జన్నారంలో మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కమ్మల విజయధర్మ, జిల్లా అధికార ప్రతినిది సిటిమల భరత్‌కుమార్, కోఆప్షన్ సభ్యుడు మున్వర్అలీఖాన్, నాయకులు ఫజల్‌ఖాన్, బోర్లకుంట ప్రభుదాస్, బాలసాని శ్రీనివాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, గురువయయ్య, శ్రీదర్‌రావు, రవి విలేకరులతో మాట్లాడారు.