చండూరు, ఫిబ్రవరి 16 : చండూరు మున్సిపల్ చైర్మన్గా కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్గా భూతరాజు దశరథ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, చండూరు ఆర్డీఓ వి శ్రీదేవి మున్సిపాలిటీలోని 10 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా ఇతరులు ఎవరు పోటికి రాకపోవడంతో చైర్మన్గా కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్గా భూతరాజు దశరథ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ చండూరు మున్సిపాలిటీలో సిసి రోడ్లు, త్రాగునీటి సమస్య, డ్రైనేజీలు, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా ఎన్నో మిగిలిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఐదు సంవత్సరాలు కౌన్సిలర్లు అందరూ సహకరించి తమ తమ వార్డులను అభివృద్ధి పథంలో నడిపించుకోవాలన్నారు. మాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి, భూషిపాక వాసు, సామ సుజాత, జల్ల ధనమ్మ, కొండ్రెడ్డి మధు, కోడి సుష్మ, కల్మికొండ పారిజాత, కటకం రమేష్, సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు.

చండూరు మున్సిపల్ చైర్మన్గా కోడి శ్రీనివాసులు