నార్నూర్ : ఆదిలాబాద్( Adilabad ) జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన రాందాన్ చౌహాన్( Ramdas Chowhan) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన తెర్వి పెద్దకర్మలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, బీఆర్ఎస్ నాయకులు ( BRS leaders ) పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, నార్నూర్ వైస్ మాజీ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు మెస్రం హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేష్, మాజీ సర్పంచ్ మడవి ముక్తా రూప్ దేవ్, ఉపాధ్యక్షులు రాథోడ్ శివాజీ తదితరులు ఉన్నారు.