తడిసిన వడ్లు కొనాలి
అకాల వర్షంతో తడిసిన వడ్లను ఎలాంటి తరుగులేకుండా, వెంటనే పూర్తి స్థాయిలో కొ నుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని రాష్ట్ర ప్ర భుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని మారెట్ యా ర్డులో తడిసిన వడ్లను పరిశీలించారు.
- అన్నదాతలను ఆదుకోవాలి
- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు
ఖానాపూర్, మే 27 : అకాల వర్షంతో తడిసిన వడ్లను ఎలాంటి తరుగులేకుండా, వెంటనే పూర్తి స్థాయిలో కొ నుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని రాష్ట్ర ప్ర భుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని మారెట్ యా ర్డులో తడిసిన వడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు, కౌన్సిలర్ తాళ్లపల్లి రాజగంగన్న, మాజీ జడ్పీటీసీ రాథోడ్ రాము నా యక్ మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో పాలిథిన్ కవర్లు, టార్పాలిన్లు కూడా యార్డులో అందుబాటులో లేకపోవడంతో రైతులు తమ ఇంట్లోని చీరలు, వస్త్రాలతో వడ్లను తడవకుండా కాపాడాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు.
మాయిచ్చర్ వ చ్చిన వడ్లను కూడా తూకం వేసి తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఇలాంటి విపతర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి తడిసిన ధాన్యా న్ని కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కానీ రైతు ప్రభుత్వమంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం రైతాంగాన్ని నట్టేట ముంచిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ షోయోబ్, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ సకారపు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గౌరికర్ రాజు, మాజీ ఎం పీపీ మోయిద్, కొకుల ప్రదీప్, కారింగల సుమన్, పెద్ది మల్లేశ్, పుప్పాల గజేందర్, సిరిగరపు లింగన్న, శనిగరపు శ్రావణ్, కరిపే శ్రీనివాస్, బీసీ రాజన్న, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం..రైతన్నకు శాపం..
జైనథ్, మే 27 : రైతులు పండించిన పంటలను సకాలంలో కొనుగోలు చేయడంలో కేంద్రంలో బీజేపీ – రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. బుధవారం మేడిగూడ సెంటర్లో తడిసిన జొన్నలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ, సీనియర్ నాయకులు పెందోర్ దేవన్న మాట్లాడుతూ సాత్నాల – మేడిగూడ జొన్నల కొనుగోలు కేంద్రం లోతట్టు ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల మంగళవారం రాత్రి వర్షంలో రైతుల జొన్న పంట తడిసి ముద్దయిందన్నారు.
కాంటా వేసిన జొన్నలను 15 రోజులుగా తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా తూకం వేసిన బస్తాలకు తక్ పట్టీలను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడి జొన్నలను పకనే ఉన్న రైతు వేదిక, ప్రభుత్వ పాఠశాలలోకి తరలించాలన్నారు. రైతుల వద్ద నుంచి పూర్తి స్థాయిలో జొన్నలు కొనేవరకూ పోరాడుతామన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో మెట్టు ప్రహ్లాద్, పొచ్చన్న, రైతులు పాల్గొన్నారు
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

