కాగజ్‌నగర్/సిర్పూర్(టీ), జూన్ 30 : మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత తగ్గించడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని రహదారి, సిర్పూర్(టీ)లోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ఆర్ఎస్పీకి భద్రత తగ్గింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకుడికి భద్రత తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. సర్కారు దిగి రాకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఆయాచోట్ల నాయకులు కొంగ సత్యనారాయ ణ, అంబాల ఓదెలు, మిన్హాజ్, గోలం వెంకటేశ్, అస్లాంబిన్ అబ్ధుల్లా, రవి వర్మా, పనాస లక్ష్మణ్, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.