రెబ్బెన/తిర్యాణి/కౌటాల, డిసెంబర్ 27 : తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని గ్రామ పంచాయతీ కార్మికులు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా టోకెన్ సమ్మె నిర్వహించారు. రెబ్బెన మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 27,28 తేదీల్లో తలపెట్టిన టోకెన్ సమ్మెను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ప్రారంభించారు. రెబ్బెన పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేశ్‌గౌడ్ మద్దతు తెలిపారు.
గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు సుధాకర్, రమేశ్, వెంకటేశ్, శంకర్, దేవాజీ, ప్రవీణ్, శ్రీనివాస్, లక్ష్మి, రాజమ్మ, రాజేశ్వరి, పద్మ, ప్రకాశ్, ధర్మయ్య, సంతోశ్, అన్నాజీ, భాస్కర్, సదాశివ్, మహేందర్, బీఆర్ఎస్ నాయకులు బోమ్మినేని శ్రీధర్, జౌరొద్దీన్, రామడగుల శంకర్, పందిర్ల మధునయ్య, దుర్గం రాజేశ్, రాపర్తి అశోక్, ఉబెదుల్లా ఉన్నారు. తిర్యాణిలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు టోకెన్ సమ్మె నిర్వహించారు.
గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సుద్దాల తిరుపతి మాట్లాడుతూ జీవో నంబర్ 50ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం ఉపాధ్యక్షుడు జంగు, కార్మికులు చిలుక రవి, నరేశ్, రాములు, భగవంతరావు పాల్గొన్నారు. కౌటాల ఎంపీడీవో కార్యాలయం ముందు జీపీ కార్మికులు టోకెన్ సమ్మె నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకుంటే జనవరి 4 తర్వాత నిరవధిక సమ్మెకు వెల్లనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో సీఐటీయూ నాయకులు జాడి మోరేశ్వర్, మోర్లె నగేశ్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట జీపీ కార్మికులు ఆందోళన చేపట్టారు.