నార్నూర్, ఆగస్టు 25 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల కోసం గోస పెట్టడం సిగ్గుచేటన్నారు. అన్నం పెట్టే రైతన్నను గోస పెట్టడం ఎంత వరకు సమాజసమని ప్రశ్నించారు. సరిపడా ఎరువులు అందించకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచ్ల సంఘం మాజీ మండలాధ్యక్షుడు ఉర్వేత రూప్దేవ్, మాజీ వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, జిల్లా నాయకుడు ఉద్దవ్ కాంబ్లే, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్, నాయకులు రాథోడ్ సుభాష్, సయ్యద్ ఖాశీం, సుల్తాన్ఖాన్, హైమద్, తదితరులు ఉన్నారు.