బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడంపై శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఫార్ములా ఈ కారు రేసింగ్‌ను చేపట్టగా, అవకతవకలకు పాల్పడ్డారంటూ కేసులు నమోదు చేయడంపై వారు మండిపడుతున్నారు. దమ్ముంటే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.
బెల్లంపల్లి, డిసెంబర్ 20 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశా రు. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడమే లక్ష్యంగా ఫార్ములా ఈ కారు రేసింగ్‌ను చేప ట్టగా, అవకతవకలకు పాల్పడ్డారంటూ కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు. రాజకీయ కక్ష్య సా ధింపులో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, అసెంబ్లీలో చర్చకు రావాలని కేటీఆర్ పిలుపునిస్తే ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తుండగా భయపడి కేసులతో వేధించాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
– దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే
బెల్లంపల్లి, డిసెంబర్ 20 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని, కేటీఆర్ పిలుపునకు ఎందుకు స్పందించడం లేదని తెలిపారు. ఇకనైనా నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలని కోరారు.
– బడికెల శ్రావణ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు
చెన్నూర్ రూరల్, డిసెంబర్ 20 : ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని మాజీ జడ్సీటీసీ మోతె తిరుపతి అన్నారు. శుక్రవారం చెన్నూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ను భయపెట్టలేరన్నారు.
– మోతె తిరుపతి, మాజీ జడ్పీటీసీ