బజార్ హత్నూర్ : మండలంలోని రైతులు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన జొన్న పంట డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడం తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం, మాజీ నెట్ క్యాప్ డైరెక్టర్ చిలుకూరి భూమన్న అన్నారు. ఆదివారం బజార్ హత్నూర్ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నెల రోజులు అయినా ఇప్పటి వరకు జొన్న పంట డబ్బులు ఖాతాల్లో జామ కాక పోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే వానకాలం సీజన్ మొదలవ్వడంతో పండించిన పంట డబ్బులతో అయినా గింజలు, మందులు కొందాం అంటే జొన్న పంట డబ్బులు రాకపోవడంతో నానా తిప్పలు అవుతుందని వారు పేర్కొన్నారు.
ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పైసలు ఇవ్వకుండా రైతులకు ఎగనామం పెడుతూ ఇప్పుడు పండించిన పంటలకు ఇవ్వకపోవడంతో శోచనీయమన్నారు.
చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మళ్లీ బాకీలు చేసి గింజలు కొనుక్కునే పరిస్థితి తెచ్చిందన్నారు. కావున ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు చొరవ తీసుకోని జొన్న పంట డబ్బులు జామ అయ్యే విధంగా చూడాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు అందె ప్రకాష్, జనార్దన్, నగేష్, శరత్ తదితరులు పాల్గొన్నారు.