నార్నూర్ : ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన బీఆర్ఎస్ నాయకుడు అలంఖాన్ను ఆదివారం ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ రామ్ జాదవ్ పరామర్శించారు. నార్నూర్ మండల కేంద్రానికి వెళ్లి అలంఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని అలంఖాన్కు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీరామ్ జాదవ్తోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.