బీఆర్ఎస్.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచారంపై మరింత దృష్టిపెట్టింది. సభలు, సమావేశాలతో ప్రజలకు చేరువైన పార్టీ.., ఇంటింటా ప్రచారంతో దూసుకుపోతున్నది.
ఇందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం కట్కంటి, అసోద, రాములుగూడ, మత్తడిగూడ, చించూఘాట్, లింగుగూడ, సల్పలగూడ, భూర్నూర్ గ్రామాల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి జోగు రామన్న.., ఇచ్చోడ మండలం కేశవపట్నం, గుండాల, గుండివాగు గ్రామాల్లో బోథ్ అభ్యర్థి జాదవ్ అనిల్.., నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి, ప్యారమూర్.
వంజర్, సత్యసాయినగర్, తాండ్ర(జీ), వైకుంఠపూర్, కంకెట, మల్లక్చించోలి, జెవుళి, స్వర్ణ గ్రామాల్లో నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.., ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో నాయకులతో ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముథోల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డిగారి విఠల్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.
– ఆదిలాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)