యువత ఉజ్వల భవిష్యత్ కోసమే బీఆర్ఎస్
యువతకు ఉజ్వల భవిష్యత్‌ను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శివకుమార్ అన్నారు.
- బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శివకుమార్
- సీఎం, మంత్రి, ఎమ్మెల్యే ఫ్లెక్సీకి పాలాభిషేకం
ఎదులాపురం, ఫిబ్రవరి 4 : యువతకు ఉజ్వల భవిష్యత్‌ను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శివకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించనున్న ఐటీ టవర్‌కు పరిపాలన అనుమతులు మంజూరు కావడంపై బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ చౌక్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై జోగు రామన్న’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఐటీ కార్యకలాపాల విస్తరణకు ప్రత్యేక చొరవ చూపడంతో ఎంతో మంది యువతకు ఉపాధి లభించే ఆస్కారం ఉందని తెలిపారు. మహా నగరాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమను ఆదిలాబాద్‌కు తీసుకురావడంలో ఎమ్మెల్యే జోగు రామన్న విశేష కృషి చేశారని వెల్లడించారు. యువతకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్, సాయికుమార్, ఖయ్యూం, ఇబ్బు, హలోక్, అభిలాష్, అజయ్, అబుజర్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

