న్యూఢిల్లీ: ఆసియా ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో భారత జిమ్నాస్ట్ అరిహా పంగంబమ్ సరికొత్త రికార్డు సృష్టించింది. సీనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్ తరఫున స్వర్ణం గెలిచిన జిమ్నాస్ట్ గా రికార్డులకెక్కింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అరిహా మొత్తం 19.100 స్కోరుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టిస్ట్రీ విభాగంలో 8.650, ఎగ్జిక్యూషన్లో 7.600, డిఫికల్టీ విభాగంలో 2.850 పాయింట్లు సాధించి పసిడి పతకం సొంతం చేసుకుంది.