ఉట్నూర్,జనవరి16 : ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆధ్యాత్మికత, సేవాభావం అభినందనీయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న, మాజీ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తన సొంత ఖర్చులతో రెండు వేల మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జనార్ధన్ ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ తన వంతుగా సేవలందిస్తున్నారని చెప్పారు. ఉద్యమ సమయంలో ఉద్యోగ జేఏసీ ద్వారా స్వరాష్ట్రం పోరాడారని తెలిపారు. ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు, మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాము, నాయకులు సుమన్బాయి, సుధాకర్, మర్సకోల తిరుపతి, తుకారాం, దేవన్న, ప్రభాకర్, కేశవ్, బానోత్ రామారావు, రాందాస్, సలీం, రాం కిషన్, గడ్డం ప్రకాశ్, విష్ణు, చంద్రకాంత్, కట్ట లక్ష్మణాచారి,బంకట్లాల్, కాంతారావు, భీమన్న, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, జనవరి 16 : క్రీడాకారులు నిరంతరం సాధన చేసినప్పుడే విజయాలు సాధించగలుగుతారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో నిర్వహిస్తున్న ఆదిలాబాద్ క్రికెట్ లీగ్ 11వ సీజన్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. పదేళ్లుగా జిల్లాలో క్రికెట్ లీగ్ పోటీలను డైట్ మైదానంలో నిర్వహిస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యే క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. కొద్ది సేపు సరదాగా బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఎమ్మెల్యేను నిర్వాహకులు సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పోటీల ఏర్పాటుకు నిర్వాహకులు ఎంతో కష్టపడ్డారని, జిల్లా క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీయడానికి వారు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్లో మరిన్ని జట్లు ఏసీఎల్లో పాల్గొని ప్రతిభ చూపాలన్నారు. అందుకు నిరంతరం సాధన చేస్తూ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మెట్టు ప్రహ్లాద్, శివ, కౌన్సిలర్ అశోక్ స్వామి, నిర్వాహకులు మోసిన్, యూసుఫ్, ఇర్ఫాన్, సాగర్, అస్లాం పాల్గొన్నారు.