ఎదులాపురం, డిసెంబర్ 24 : తెలంగాణలో రైతులు కల్లాలు నిర్మించుకో వడమే తప్పా.. ఇతర రాష్ట్రల్లో చేపలను ఆరబెట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు.. కానీ తెలంగాణలో నిర్మించుకున్న కల్లాలకు నిధులు ఇవ్వరా.. అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కేంద్ర ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కల్లాలు నిర్మించకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.150 కోట్లు తిరిగి చెల్లిం చాలని ఉత్తర్వులు జారీ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు అనేక సంక్షేమ పథకాలను కట్ చేస్తూనే వచ్చిందన్నారు. అందులో ప్రధాన్ మంత్రి కృషి వికాస్ యోజన, రాష్ట్రీయ వికాస్ యోజన 2018 నుంచి బంద్ చేశారన్నారు. భూ పరీక్షల పథకాన్ని కూడా ఎత్తేసిం దన్నారు. ఇదీ బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమా లేదా అనుకులా ప్రభుత్వమా రైతులు గమనిం చాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో పీఎం సమ్మన్ పథకం కింద 96 వేలమందికి డబ్బులు ఇచ్చే వారు.. ఈకేవైసీ చేయలేదని, ఆధార్ లింక్ లేదని రైతులకు రావాల్సిన డబ్బులను ఇవ్వడం లేద న్నారు. ఇతర రాష్ర్టాలకు ఓ న్యాయం తెలం గాణ మరో న్యాయమా అని ప్రశ్నించారు. బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రైతులు తమ పంటను రోడ్లపై ఆరబెట్టుకొని ప్రమాదాల బారిన పడలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు బాగుంటే దేశం బాగుంటుందనీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏనాడు రైతులను పట్టించుకోలేదన్నారు. బీజేపీ నాయ కులు అసలు వ్యవసాయం చేశారా? వ్యవసాయం గురించి ఏమైనా తెలివి ఉందా? భూ కబ్జాల మంత్రి కిషన్ రెడ్డికి ఇంగిత జ్ఞానం ఉందా అని మండిపడ్డారు. కేంద్రం కొనలేమని చెప్పినా ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొన్నదని పేర్కొ న్నారు. నిత్యం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుతూ పేదల నడ్డీ విరుస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 25 శాతం వివిధ పంటలను కొనుగోలు చేస్తే మిగిలిన పంటలను తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.ఆదానీ, అంబానీలకు కొమ్ము కాస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు.
మహిళల సంక్షేమమే ధ్యేయం
మహిళల సంక్షేమమే సర్కారు ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నా రు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యా లయంలో శనివారం 51 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల కు మేనమామ వలే పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొ న్నారు. ఆయా చోట్ల డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, ఆత్మ చైర్మన్ జిట్ట రమేశ్, మండలా ధ్యక్షుడు సెవ్వలక్ష్మి జగదీశ్, ఏఎంసీ చైర్మన్ విజయ లక్ష్మీరాజు, డీసీసీబీ డైరెక్టర్ పరమేశ్వర్, ఏఎంసీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నరేశ్, బీఆర్ఎస్ నాయకులు రమేశ్, భాస్కర్ ఎవన్, నారాయణ, అనిల్, దీవిటి రాజు, శ్రీనివాస్, రమేశ్ ఉన్నారు.
పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరిక
సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అకర్శితులై ఇతర పార్టీకి చెందిన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ కుర్రనరేశ్తో పాటు దాదాపు 50 మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఎంపీపీ ఏవన్, ఆత్మ చైర్మన్ జిట్ట రమేశ్, నాయకులు దాసరి రమేశ్, జగదీశ్, రాజు ఉన్నారు.
దగ్ధమైన పత్తి పరిశీలన
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 24 : ఆదిలా బాద్ రూరల్ మండల పిప్పల్ధరి గ్రామ పరిధిలో ని దహిగూడకు చెందిన కొడప రాజుకు చెందిన పత్తి శుక్రవారం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఎమ్మెల్యే జోగు రామన్న బాధితుడి నివాసానికి శనివారం వెళ్లి పరామర్శించారు.