T20 World Cup | వరల్డ్‌కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ.. దద్ధరిల్లిన వాంఖడే.. వీడియో..!
T20 World Cup : భారత్‌లో క్రికెట్ జ్వరం మళ్లీ మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టోడియం అభిమానులతో నిండిపోగా.. అందరి కరతాళధ్వనుల మధ్య ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ (Rohit Sharma) రాయల్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
T20 World Cup : భారత్‌లో క్రికెట్ జ్వరం మళ్లీ మొదలైంది. నిరుడు మహిళల వన్డే ప్రపంచకప్ ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు పొట్టి ప్రపంచకప్ సందడి ఘనంగా షురూ అయింది. ముంబైలోని వాంఖడే స్టోడియం అభిమానులతో నిండిపోగా.. అందరి కరతాళధ్వనుల మధ్య ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఐసీసీ అధ్యక్షుడు జై షాలు ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్ డ్రెస్, తెలుపు షూతో తళుక్కుమన్న రోహిత్ వరల్డ్‌కప్ ట్రోఫీతో మైదానంలోకి వచ్చాడు.
పదో సీజన్ టీ20 ప్రపంచకప్ పోటీలతో క్రీడాభిమానులు పులకించిపోతున్నారు. భారత జట్టు మ్యాచ్‌కు వేదికైన వాంఖడే స్టేడియం కిక్కిరిసిపోయింది. డ్రమ్స్ శివమణి తన స్టయిల్ ప్రదర్శనతో అభిమానులతో స్టెప్పులు వేయించారు. మరోవైపు నృత్యకారులు.. యువతీయువకుల బృందం లయబద్ధంగా, హుషారుగా డ్రమ్స్ వాయిస్తూ వరల్డ్‌కప్ జోష్ నింపారు. అనంతరం ప్రపంచకప్ అంబాసిడర్, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చాడు. ఐసీసీ ఛైర్మన్ జై షాతో కలిసి ఎంట్రీ ఇచ్చిన హిట్‌మ్యాన్.. వరల్డ్‌కప్ ట్రోఫీని మైదానంలోకి తీసుకొస్తుంటే రోహిత్.. రోహిత్ నినాదాలతో స్టేడియం మార్మోగిపోయింది.
The walk of brand ambassador Rohit Sharma with T20 World Cup trophy at Wankhade.🥵🔥 pic.twitter.com/2myVajzMFs
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) February 7, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

