IND vs USA : స్వదేశంలో జరుగుతున్న పదో సీజన్ టీ20 ప్రంపచకప్‌లో భారత్ తొలి మ్యాచ్‌కు వేళైంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా వాంఖడే స్టేడియంలో యూఎస్ఏతో తలపడుతోంది. భారీగా అభిమానులు పోటెత్తిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మొనాంక్ పటేల్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆరంభ పోరుకు సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా దూరమయ్యారని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
గత సీజన్లో విజేతగా నిలిచిన టీమిండియా తొలి పోరులో యూఎస్ఏను చిత్తు చేసి ఘనంగా బోణీ కొట్టాలనుకుంటోంది. అయితే.. గాయం కారణంగా బుమ్రా దూరమవ్వగా.. హర్షిత్ రానా స్థానంలో స్క్వాడ్‌లోకి వచ్చిన సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఓపెనర్‌గా న్యూజిలాండ్‌పై విఫలమైన సంజూ శాంసన్ బదులు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అమెరికా జట్టు ఆరుగురు బ్యాటర్లు ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు పేసర్లతో ఆడుతున్నామని చెప్పాడు.
Presenting #TeamIndia‘s Playing XI for our opening game 🙌
Updates ▶️ https://t.co/Rlm2ARPnOV#MenInBlue | #T20WorldCup | #INDvUSA pic.twitter.com/NwiHkAvNbg
— BCCI (@BCCI) February 7, 2026
భారత్ తుది జట్టు : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్.
యూఎస్ఏ తుది జట్టు : ఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), సాయితేజ ముక్కమల్ల, మొనాంక్ పటేల్(కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ క్రిష్ణమూర్తి, శుభం రంజనే, హర్మీత్ సింగ్, మొహమ్మద్ మొహ్సిన్, షాడ్లే వాన్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్.