ఇచ్చోడ, అక్టోబర్ 18 : ఎన్నికల వేళ గ్రామాల్లోకి మోసగాళ్లు వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మండల కేంద్రంలోని విఠల్ రెడ్డి ఫంక్షన్ గార్డెన్లో మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నదన్నారు. మరోసారి గెలిపిస్తే మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకారం రూ.400కే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, పింఛన్ రూ.5 వేలు, రైతుబంధు రూ.16 వేలు పెరుగుతుందని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
– అనిల్ జాదవ్, బోథ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
బోథ్ నియోజకవర్గంలో తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ నియోజకవర్గం బీఆర్ఎస్ అడ్డ అని, నాలుగు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని పేర్కొన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. మండలాధ్యక్షుడు ఏనుగు కృష్ణా రెడ్డి, ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పాండు రంగ్, సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, ఎంపీటీసీలు సుభాష్, వెంకటేష్, శివారెడ్డి, మండల మాజీ కన్వీనర్ మేహరాజ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కృష్ణ కుమార్, మాజీ ఎంపీపీ అరుణ్, బీఆర్ఎస్ నాయకులు అభిరాం, రమేశ్, అబ్దుల్, ఫరీద్, గణేశ్, గంగాధర్, కరీం, అజీమ్, ప్రవీన్, పాండు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.