కోటపల్లి, నవంబర్ 8 : చెన్నూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మందమర్రిలో మంగళవారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు అనుకున్నదాని కన్నా రెట్టింపు సం ఖ్యలో ప్రజలు తరలిరాగా కారు స్పీడ్ మరింత పెరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అ భ్యర్థి బాల్క సుమన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ కావడంతో చెన్నూర్ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ నిలిచింది.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసగం అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సాగగా గులాబీ దళంలో రెట్టింపు జోష్ కనిపించింది. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం, మందమర్రి మండలాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు ఆశీర్వాద సభకు తరలివచ్చి హాట్రిక్ సీఎం కేసీఆర్, చెన్నూర్‌కు రెండోసారి ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటూ నినాదాలు చేయడం ఆకట్టుకుంది. చెన్నూర్ ప్రజా ఆశీర్వాద స భలో 40వేల కుర్చీలు వేయగా, అన్నీ నిండిపోగా సుమారుగా 10 వేల నుంచి 20 వేల మంది జనాలు సభ బయటే ఉన్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు, సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి బాల్క సుమన్ చేసిన కృషిని వివరించడంతో పాటు కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే కలిగే నష్టాలను వివరించారు. ఎన్నికల సమయంలో సూట్‌కేసులు పట్టుకొని వచ్చే నాయకులు కావా ల్నా… ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కొట్లాడే బాల్క సుమన్ కావాల్నా అని కేసీఆర్ అన్న మాట ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఆపద, సంపతి వచ్చినప్పుడు మనముందే ఉండే నాయకుడు కావాలని, చిల్లరమల్లరకు ఆశ పడితే ఆగమయితామని కేసీఆర్ గుర్తు చేశారు.
దళితులకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతో పాటు కాంగ్రెస్, బీజేపీలు సింగరేణి నిర్వీర్యానికి చేస్తున్న కుట్రలను వివరించారు. ఓటు వజ్రాయుధమని, దానిని సక్కగా వాడుకొ ని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కేసీఆర్ కోరారు. చెన్నూర్ నియోజకవర్గం లో సుమన్ రాక ముందు.. వచ్చిన తర్వాత.. అనే విషయాన్ని చూసి ఓటు వేయాలన్నారు. బాల్క సుమన్ తనకు ఎంత దగ్గరనో చెప్తూనే, మళ్లీ గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో వివరించారు.
చెన్నూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ సూపర్ హిట్ కావడం గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది. ఎనలేని ఉత్సాహంతో నియోజకవర్గం నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు, మహిళలు తరలిరావడం చూసి చె న్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోమారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చర్చించుకోవడం కనిపించింది. చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేసిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలివచ్చారు.
‘బాల్క సుమన్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తి కా బట్టి, నేనున్న నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృది చేసుకోవాలనే తండ్లాడుతాండు. సుమన్ రెండు ప ను లు చేస్తుండు. ఇక్కడ మీ సేవలు చేస్తడు చెన్నూర్‌లో. అ క్కడ పార్టీ కోసం మా ఇంట్లనే ఉంటడు. నా బిడ్డలాంటోడని పోయిన సారె చెప్పిన. హైదరబాద్‌లో ఉంటే సగం టైం నా ఇంట్లోనే ఉంటడు. అలాంటి వ్యక్తి గెలిస్తే మీకు లాభం కలుగతది. ముఖ్యమంత్రి చెయ్యికిందనే ఉంట డు కాబట్టి ఏ పని చెప్పిన ఆగకుండా నడుస్తది. మంచి బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉంది. పార్టీలు మార్చి సూట్‌కేస్‌లు పట్టుకొని వచ్చేటోళ్ళు గెలిస్తే అభివృద్ధి జరగదు… ప్రజల కోసం పనిచేసెటోన్ని గెలిపించుకుంటే అభివృద్ది జరుగుతుంది’
-చెన్నూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్నోళ్లు తెలంగాణాకు అ న్యాయం చేసిండ్రు. రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీ ఆర్ పదేండ్ల పాలన అద్భుతం. పక రాష్ట్రాలు కూ డా మనకెళ్లే చూసేటట్టు అభివృద్ధి చేసిండు. అభివృద్ధి, సం క్షేమ పథకాలను పెట్టి మా ఇండ్లకు వచ్చి షాదీముబా రక్, కల్యాణలక్ష్మి, ఆసరా, దళితబంధు, బీసీ బంధువంటి సంక్షేమ పథ కాల ను ప్రవేశపెట్టిండు. చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధ్దిలో ముందు ఉంచు తు న్న బాల్క సుమన్‌కే మా మద్దతు.
-వ్యాంసని మమత, మందమర్రి
అరవై ఏండ్లలో జరగని చెన్నూర్ నియోజకవర్గ అభి వృద్ది బాల్క సుమన్ హయాంలో జరిగింది. గ్రామాల కు రోడ్లు, వాగులపై బ్రిడ్జిలు లేక అవస్థలు పడిన ప్రజ లు సుమన్ పాలనలో వెలుగు చూసిండ్రు. మంత్రు లుగా ఉన్నప్పుడు కూడా జరగని అభివృద్ధ్ది ఎమ్మెల్యే గా బాల్క సుమన్ ఎంతగానో చేసిండు. అభివృద్ధ్దే అజెండాగా సాగుతున్న బాల్క సుమనన్నకే మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
-కొడిశెట్టి రాజు, సూపాక (కోటపల్లి)
బీఆర్ఎస్ పాలనలోనే సింగరేణికి మంచిరోజులు వ చ్చాయి . గత ప్రభుత్వాలు కూడా ఏవి కూడా సింగ రేణిని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో బాల్క సుమన్ సారథ్యంలో మాకు మంచి రోజులు వచ్చా యి. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీ ఆర్ఎస్కే మా మద్దతు ఉంటుంది. -సీపెల్లి రాజలింగు, సింగరేణి కార్మికుడు