ఖానాపూర్ టౌన్, డిసెంబర్ 5 : పట్టణంలోని తిమ్మాపూర్ శాఖ ఎస్బీఐలో జరిగిన కుంభకోణంలో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ఆర్.శంకర్ తెలిపారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఇదే బ్యాంక్‌లో 2009లో మే నేజర్గా పని చేసిన పెనబోడి సురేంద్ర, స్థానిక సుభాష్‌నగర్‌కు చెందిన దళారీ గంధం సత్యనారాయణతో కలిసి ప్రజలకు లోన్లు ఇస్తామని నకి లీ అకౌంట్లను తెరిచారు.
స్వయం సహాయక సం ఘాల పేరిటా స్థానికుల పేర్లను గ్రూపులో నమో దు చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఫోర్జరీ సంతకాలతో రూ. 8.37 లక్షల ను విత్ డ్రా చేశారు. ఈ విషయాన్ని ఇటీవల బ్యాంక్ అ ధికారులు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశా రు. విచారణ అనంతరం బ్యాంక్ అప్పటి మేనేజర్‌తో పాటు దళారీపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.