WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రికార్డు స్కోర్ కొట్టినా ఢిల్లీ క్యాపిటల్స్ కల సాకారమవ్వలేదు. తొలి కప్‌ను ఒడిసిపట్టాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉఫ్‌మనిపించింది. జార్జియా వోల్(79), కెప్టెన్ స్మృతి మంధాన(87)లు వీరవిహారం చేశారు. పసలేని ఢిల్లీ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ బౌండరీల మోతతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 165 పరుగుల జోడించి.. ఆర్సీబీని గెలుపు దిశగా నడిపారు. వోల్, మంధాన ఔటయ్యాక డీ క్లెర్క్ (6 నాటౌట్), రాధా యాదవ్(8 నాటౌట్) లాంఛనం పూర్తి చేచేశారు. అంతే.. నాలుగోసారైనా కప్‌ను ముద్దాడాలనుకున్న ఢిల్లీ ఫైనల్ ఫోబియాతో మంచి అవకాశాన్ని చేజార్చుకుంది.
డబ్ల్యూపీఎల్ చరిత్రలో మరోసారి రన్నరప్ ట్యాగ్‌కే పరిమితమైంది ఢిల్లీ క్యాపిటల్స్. వడోదరలోగురువారం జరిగిన ఫైనల్లో రికార్డు స్కోర్ చేసినా ఆర్సీబీ ముందు ఢిల్లీ నిలువలేకపోయింది. భారీ ఛేదనలో తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన గ్రేస్ హ్యారిస్(8)ను హెన్రీ ఔట్ చేసింది. ఆ తర్వాత కెప్టెన్ స్మృతి మంధాన(87)జతగా జార్జియా వోల్(74) బౌండరీలతో చెలరేగింది. అర్ధ శతకం పూర్తి చేసుకుంది. కాసేపటికే మంధాన సైతం ఫిఫ్టీ అందుకుంది. వీరిద్దరు శతక భాగస్వామ్యంతో ఆర్సీబీని గెలుపు దిశగా నడిపారు. 165 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని ఎట్టకేలకు మిన్ను మని విడదీసింది.
𝘾.𝙃.𝘼.𝙈.𝙋.𝙄.𝙊.𝙉.𝙎 🏆🏆
Royal Challengers Bengaluru have Claimed the Crown once again in spectacular fashion to clinch the #TATAWPL 2026 title ❤️#ClaimTheCrown | #RCBvDC | #Final | @RCBTweets pic.twitter.com/JDKUm3BDqk
— Women’s Premier League (WPL) (@wplt20) February 5, 2026
కానీ, అప్పటికే బెంగళూరు విజయం ఖాయమైంది. 21 బంతుల్లో 30 రన్స్ కావాలంతే. రీచా ఘోష్(6)ను నందిని శర్మ వెనక్కి పంపగా ఢిల్లీ జట్టులో ఆశలు చిగురించాయి. కానీ, నడినే డీక్లెర్క్() బౌండరీతో .. ఉంది. హెన్రీ ఓవర్లో స్వీప్ షాట్ ఆడబోయిన మంధాన బౌల్డ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత బంతికే రాధా యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను మిన్ను మని నేలపాలు చేసింది. ఆఖరి ఓవర్లో 10 పరుగలు అసవరమవ్వగా.. రాధా యాదవ్ (8 నాటౌట్) రెండు బౌండరీలు బాదింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆర్సీబీ రెండోసారి విజేతగా నిలిచింది.
𝗔𝗥𝗘 𝗬𝗢𝗨 𝗡𝗢𝗧 𝗘𝗡𝗧𝗘𝗥𝗧𝗔𝗜𝗡𝗘𝗗? 🤩
An incredible finish to #TATAWPL 2026 as @RCBTweets clinch an absolute thriller to win their Title No. 2⃣ 👏
Scorecard ▶️ https://t.co/9sgUo0XSZa#TATAWPL | #ClaimTheCrown | #RCBvDC | #Final pic.twitter.com/sTZtNXQ3Ue
— Women’s Premier League (WPL) (@wplt20) February 5, 2026
మొదట ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు శివమెత్తారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు దంచేయగా డబ్ల్యూటీసీ టైటల్ పోరులో ఢిల్లీ రికార్డు స్కోర్‌తో చరిత్రకెక్కింది. ఓపెనర్లు శుభారంభమివ్వగా.. జెమీమా రోడ్రిగ్స్(57) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఒత్తిడికి లోనైన ఆర్సీబీ బౌలర్లను ఆఖర్లో లారా వొల్వార్డ్త్(44), చిన్నెల్లీ హెన్రీ(32 నాటౌట్) బెంబేలెత్తించారు. డీక్లెర్క్ వేసిన 18వ ఓవర్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన హెన్రీ 24 రన్స్ రాబట్టగా.. చివరి ఓవర్లో పది రన్స్ రావడంతో బెంగళూరుకు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
జెమీమా రోడ్రిగ్స్(57)