దిలావర్పూర్ మే 13 : ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్మల్ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని దేవాదాయ న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొ న్నారు. మెడికల్ కాలేజీ మంజూరు చేయిం చి రుణం తీర్చుకున్నానని తెలిపారు. కదిలి గ్రామం లో దేవాదాయ శాఖ నిధులు రూ.12 లక్షలతో నిర్మిం చిన భీమన్న దేవుని ఆలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అంతకు మందు ఆల యం వద్ద పండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భీమన్న దేవునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తాను దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్య తలు చేపట్టిన నుంచి నిర్మల్ జిల్లాలో 1000కి పైగా ఆలయాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు.
692 ఆలయాలు పూర్తి చేసి ప్రారం భోత్సవాలు చేసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నిక లు సమీపిస్తున్న వేళ ఎవరెవరో వచ్చి ఏదో చేస్తామని చెబితే నమ్మవద్దని సూచించారు. నిర్మల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. త్వరలోనే నిర్మల్ నియోజకవర్గం లోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్యాకేజీ 27పనులు పూర్తి కానున్నాయని చెప్పారు. కర్నాటకలో పట్టిన గతే బీజేపీ పార్టీకి తెలంగాణ లో పడుతుందని పేర్కొన్నారు. స్థానిక సర్పంచ్ సరితారాజు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, కదిలి, కాల్వ ఆలయాల చెర్మన్లు భుజంగ్రావుపటేల్, చిన్న య్య, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుభాష్‌రావు, కదిలి ఆలయ మాజీ చైర్మన్ సంబాజీ పటేల్, మాడెగాం ఉప సర్పంచ్ మారుతి పటేల్, కాల్వ ఆలయ మాజీ చైర్మన్ ఇప్ప నర్సారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్దె అనిల్, ఒడ్నం కృష్ణ, భూమేశ్‌రెడ్డి, తహసీల్దార్ కరీం, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మంత్రికి కృతజ్ఞతలు
నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరుతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనుమతులను మంజూరు చేసినందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రి క్యాంపు కార్యాలయం లో పలువురు వైద్యులు పుష్పగు చ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి వైద్యులు స్వర్ణా రెడ్డి, వేణుగోపాలకృష్ణ, డాక్టర్ రజినీ పాల్గొన్నారు. అలాగే శాస్త్రీనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని నాయకులు కలిశారు. నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరుతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మంజూరుకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, నాయకులు దేవేందర్‌రెడ్డి కలిసిరు.
ఇంటర్ విద్య ఎంతో కీలకం..
ఇంటర్ విద్య ఎంతో కీలకమైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఎస్ఆర్ బాలికల కళాశాలకు చెందిన శ్రేష్ట ఎంపీసీలో 467 మార్కులు, బైపీసీలో అక్షయ 436 మార్కులు సాధించడంతో నిర్మల్‌లోని క్యాంపు కార్యాలయం లో మంత్రి వారిని సన్మానించారు. ఇంటర్ రెండో సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి సూచించారు. ఎస్ఆర్ విద్యాసంస్థల బాధ్యుడు దేవీదాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి
సోన్, మే 13 : అధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం గంగా పూర్ తండాలో జరిగిన ఆంజనేయ స్వామి విగ్ర హ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తిమార్గాన్ని ఆచరించినప్పుడే సమాజంలో శాంతి, సమానత్వం పెరుగుతుందని తెలిపారు. రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్ల వెంకట్రామ్రెడ్డి, సర్పంచ్ సునీత, నిర్మల్ మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు.