నేరడిగొండ, ఏప్రిల్ 24 : వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సూచించారు. మండలంలోని కుంటాల జలపాతానికి వెళ్లే మార్గంలో సావర్గాం గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులను సోమవారం పరిశీలించారు. రూ.3.28 కోట్లతో నిర్మిస్తున్న ఈ వంతెనతో ఇక్కడ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలగనున్నాయన్నారు. పనులను వేగవంతం చేసి వర్షాకాలంలోగా రాకపోకలు సాగేలా చూడాలని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ రాథోడ్ సజన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిత్రే నారాయణసింగ్, గిరిజన లంబాడాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జాదవ్ మహేందర్, వీడీసీ చైర్మన్ ఏలేటి రవీందర్‌రెడ్డి, కరణ్‌సింగ్, కమల్‌సింగ్, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ జంగు, పాండు తదితరులు ఉన్నారు.
నేటి సమావేశాన్ని విజయవంతం చేయండి
బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు. నేరడిగొండకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కన్వీనర్లు, ఆర్బీఎస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరుకావాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటలకు సమావేశాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.