భీంపూర్, మే 7 : రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలు, పీహెచ్‌సీలు, రిమ్స్ తదితరవి కార్పొరేట్‌కు దీటుగా సేవలందిస్తున్నాయని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. భీంపూర్‌లో రూ.13 లక్షలతో ఫార్మాసిస్ భవన ( మందుల నిలువ చేసేది) నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదివారం భూమి పూజ చేశారు. అనంతరం పీహెచ్సీలో బాలింత సీతాబాయికి కేసీఆర్ కిట్ అందజేశారు. బాలింత కుటుంబ సభ్యురాలు లక్ష్మీబాయిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్కారు దవాఖానల్లో ఉచిత, మెరుగైన వైద్యం అందుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, పీహెచ్‌సీల్లో నెలనెలా ఉచిత పరీక్షలు, సురక్షిత ప్రసవాలు, నగదు ప్రోత్సాహకం, కేసీఆర్ కిట్ తదితరవి కేవలం బీఆర్ఎస్ సర్కారుకే సాధ్యమైందన్నారు. ఆరోగ్యవంత తరం కోసం మాతా శిశు సంరక్షణ కింద ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
ప్రభుత్వం మహిళా సంరక్షణకు పెద్దపీట వేసిందన్నారు. భీం పూర్ పీహెచ్సీ పేరు జాతీ య స్థాయిలో మార్మోగడం ఇక్కడి వైద్యాధికారులు, సిబ్బంది, ఆశ కార్యకర్తల చిత్తశుద్ధికి నిదర్శనమన్నా రు. భీంపూర్ మండలం పిప్పల్‌కోటి వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌తో వేలాది ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పథకాలు, అభివృద్ధి పనులు చూసి బీజేపీ సర్కారే అవార్డులు ఇవ్వడం గమనించాలన్నారు. దేశమంతా బీఆర్ఎస్ విస్తరణ కోసం నిరీక్షిస్తున్నదని, సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు విజయసారథి, నిఖిల్రాజ్, అశ్విని, హెచ్‌ఈవో జ్ఞానేశ్వర్, సిబ్బంది గంగాధర్, లూసి, విష్ణు, అశోక్‌రెడ్డి, శ్రీదేవి, సుజాత, సరస్వతి, జనాబాయి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, సర్పంచ్‌లు మడావి లింబాజీ, సయ్య ద్ ఖాదర్, రైతుబంధు మండలాధ్యక్షుడు అనిల్, కోఆప్షన్ మెంబర్ జహూర్ అహ్మద్, నాయకులు ముకుంద సంతోష్, గంగయ్య, జాదవ్ రవీందర్, పాండురంగ్, సర్పంచ్‌లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.