నేరడిగొండ, డిసెంబర్ 12 : : గెలిచిన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్దే లక్ష్యం పని చేయాలని కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. నేరడిగొండ మండలంలోని నాగమల్యాల్ గ్రామానికి చెందిన ఏకగ్రీవంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన సర్పంచ్ గోడం నందినీ అమృత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం నేరడిగొండలోని తన నివాసంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్ గంగాధర్, వార్డు సభ్యులు మహేందర్, నారాయణ, రజిత, నైతం లక్ష్మి, గూళ్లే లక్ష్మి, విజయలక్ష్మి, విజేశ్ను ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం వారిని శాలువా కప్పి సన్మానించారు. తమ గ్రామ అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారం ఎమ్మెల్యే అనిల్‌తోనే సాధ్యమని పార్టీలో చేరినట్లు సర్పంచ్ నందినీ అమృత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ సర్పంచ్ భీముడు, యువ నాయకులు రాథోడ్ సురేందర్, ఖయ్యూం, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, డిసెంబర్ 12 : ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో మొదటి విడుతలో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్‌లను శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సన్మానించారు. ఇచ్చోడ మండలంలోని దాబా(బీ) సర్పంచ్ ఈశ్వర్, గుండాల సర్పంచ్ రషీద్, ఎల్లమ్మగూడ సర్పంచ్ అజీజ్, సిరికొండ మండలంలోని పొన్న సర్పంచ్ చౌహాన్ భారతీబాయి-సూర్యకాంత్ పాటిల్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఇచ్చోడ కన్వీనర్ కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాత్ నంబర్ గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన బీఆర్ఎస్ బలపర్చిన రాథోడ్ రమేశ్‌తో, వార్డు సభ్యులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సన్మానించి అభినందించారు.