అంబేద్కర్ ఆశయ సాధనే బీఆర్ఎస్ ధ్యేయం
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల పరిరక్షణే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి(బీ) గ్రామంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిషరణ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిషరించి నివాళులర్పించారు.
- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తలమడుగు, జూలై 26 : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల పరిరక్షణే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి(బీ) గ్రామంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిషరణ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిషరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేదర్ రచించిన రాజ్యాంగం దేశ ప్రజల హకులకు రక్షణ కవచమని, సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే విలువలు ప్రతి భారతీయుడి జీ వితంలో ప్రతిబింబించాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దళి త, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి అంబేద్కర్ ఆశయాలను కార్యరూపంలో చూపిందని పేరొన్నారు. దళిత బిడ్డలు సైతం ఆర్థికంగా బాగుపడాలని ఆనాడు కేసీఆర్ దళితబంధు పథకం అమలుచేసి ఒకో లబ్ధిదారులకు రూ.10 లక్షలు అందజేశారన్నారు. భూములు లేని దళితులకు దళితబస్తీ పథకం ద్వారా 3 ఎకరాల భూమి అందజేశారని గుర్తు చేశారు.
నేడు రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ప్రజాస్వామ్య విలువలను బలహీనపరిచే చర్యలు జరుగుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ బోధనలు మరింత అవసరమన్నారు. సమాజంలో ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన అంబేద్కర్కు నివాళి అని పేరొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు రమేశ్, అశోక్, న్యాయవాది కేమ శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు తోట వెంకటేశ్, మొట్టె కిరణ్ కుమార్, అభిరాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్లా, మగ్గిడి ప్రకాశ్, మడూరి మల్లేశ్, రమాకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బ్రిడ్జి మరమ్మతులను నాణ్యతగా చేపట్టాలి
తలమడుగు మండలంలోని దేవాపూర్ ప్రధాన రహదారిలోని బ్రిడ్జి మరమ్మతులు నాణ్యతతో చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్కు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. ఆదివారం మరమ్మతులను పరిశీలించారు. నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వెంట మాజీ సర్పంచ్ అబ్దుల్లా, నాయకులు అభిరాం రెడ్డి, కేమ శ్రీకాంత్, సతీశ్ రెడ్డి, రవికాంత్, నాగిరెడ్డి, రవీందర్ రెడ్డి, స్వామి, సురేందర్ యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

