నేరడిగొండ, జూన్ 24 : ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు సోమవారం మర్యా ద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలపై ఆరా తీశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అండగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు.