సారంగాపూర్, జూన్ 24 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లోజి నరసయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు భరోసా నిధుల జమా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రెండు పంటలకు రూ.12వేలను రైతు ఖాతాలో జమ చేసిందన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ఆదుకుంటుం దన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నియోజకవర్గానికి 3500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
ఇదివరకే పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రెండో విడత కూడా 3500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని, ప్రతి ఒక్కరికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీరవెల్లి రైతు వేదిక భవనంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వచ్చినప్పుడు ప్రొటో కాల్ పాటించలేదని నరసయ్య మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మినిస్టర్, ఇన్చార్జి మినిస్టర్ ఫొటోలను ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టకపోవడం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తామన్నారు.
కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, అడిగి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బోజగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్ మహ్మద్, మాజీ అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ వెంకట్ రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు విలాస్ రావు, నాయకులు అట్ల పోతారెడ్డి, మారుతి, నవీన్ రెడ్డి, ముత్యం రెడ్డి, లింగారెడ్డి, సత్యపాల్ రెడ్డి, లక్ష్మణ్, నారాయణ, భోజన్న, పోతారెడ్డి, జగదీష్, సత్యం, మసీద్, సుమన్, నర్సారెడ్డి, నారాయణరెడ్డి, మధుకర్, భూమారెడ్డి, పోతన్న, ప్రశాంత్, నాగారావు, చల్ల సాయన్న, లస్మన్న, రాము, శేఖర్, గంగన్న, మహేందర్, రాజేశ్వర్, ధన్సింగ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.