ఎదులాపురం, ఫిబ్రవరి16: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో గురువారం జైనథ్ మండలం నిరాల గ్రామానికి చెందిన 70 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ ప్రజలను మోసం చేయడంలో చూపిస్తున్న చిత్తశుద్ధి, సంక్షేమ పథకాలను అందిచడంలో లేద న్నారు. బీజేపీ వైఖరిని నిరసిస్తూ ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నిరాల సర్పంచ్ సునంద ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి, రోకండ్ల రమేశ్, గంగాప్రసాద్, సుభాష్, కేశవ్, విఠల్ ఉన్నారు.
ఆలయాల నిర్మాణానికి భూమిపూజ
జైనథ్ మండలం కేదాపూర్, గిమ్మ గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే జోగు రామన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. ఇటీవల సీఎం కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి రూ.1000 కోట్లు సైతం ఖర్చు చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, నాయకులు వెంకట్ రెడ్డి ,లింగ రెడ్డి ,ఎంపీటీసీ భోజన్న, వేణుగోపాల్ యాదవ్ , చంద్రయ్య, పరమేశ్వర్, సాంబులు, ఆయాగ్రామాల ప్రజలు పాల్గొన్నారు.