జన్నారం, జనవరి 12 : కవ్వాల్ టైగర్ రిజర్వుడ్ ఫారెస్ట్‌లోని జన్నారం, తాళ్లపేట్రేం జ్ పరిధిలోని గోండుగూడ, బైసన్‌కుంట ప్రాంతంలో రేంజ్ ఆఫీసర్ సుష్మారావు ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన బర్డ్‌వాక్ ఫెస్టివల్‌కు విశేష స్పందన వచ్చింది. నిర్మల్, గుంటూర్, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అతిథులు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి దట్టమైన అడవి అందాల ను తిలకిస్తూ ముందుకు సాగారు.
అక్కడక్కడా పక్షులు కిలకిలారావాలతో కనువిందు చేయగా, వారికి కొత్త అనుభూతినిచ్చింది. వాటిని కెమెరాల్లో చిత్రీకరించారు. ఓరియంటల్రాబిన్, సర్పెంట్ ఈగ ల్, ఊలినెక్డ్ స్టార్క్, సిల్వర్ బిల్స్ బర్డ్స్, గ్రేహెరాన్, కార్మో రాంట్తో పాటు మరో 39 రకాల పక్షులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డీఆర్వో తిరుప తి, చింతగూడ సెక్షన్ ఆఫీసర్ నహిద, ఎఫ్‌బీవోలు లాల్‌బాయి, శివ, సాయి ఉన్నారు.
కవ్వాల్ టైగర్ రిజర్వుడు డివిజన్లోని జన్నారం రేంజ్ పరిధిలోని గోండుగూడ, బేస్ క్యాంప్, బైసన్‌కుంట ప్రాంతాల్లో హైదరాబాద్‌కు చెందని హైకోర్టు స్పెషల్ ఫీడర్ స్వరూప్, ఏజీపీ రవికుమార్ తమ కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. రేంజ్ ఆఫీసర్ సుష్మారావు వారికి వన్యప్రాణులకు కల్పిస్తున్న ఆహారం, నీటి వసతులు, గడ్డి క్షేత్రాలు, వాచ్ టవర్స్‌తో పాటు నీటి కుంటలు, అరుదైన పక్షుల గురించి వివరించారు.