నేరడిగొండ, జూన్ 21 : పేద విద్యార్థులు చదువులో రాణిస్తే వారికి మంచి భవిష్యత్ ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నిమ్మల ప్రీతంరెడ్డి, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, వీడీసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, ఇచ్చోడ మాజీ పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, నాయకులు రాథోడ్ సురేందర్, రాజశేఖర్, సంతోష్‌సింగ్, గులాబ్‌సింగ్, ప్రతాప్‌సింగ్, పాఠశాల ఎస్వో రజిత పాల్గొన్నారు.