నస్పూర్, నవంబర్ 1: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయ త్నం చేయించిన కాంగ్రెస్ పార్టీ హింసా రాజకీయాలపై చర్యలు తీసుకోవాలని కోరు తూ బుధవారం ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యేబాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బుధవారం కలెక్టర్ బదావత్ సంతోష్‌ను కలిసి వినతి పత్రం అందించా రు.
అనంతరం వారు మాట్లాడుతూ పదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కల్లోలం అని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఫ్యాక్షన్ , హత్యా, హింసా రాజకీయాలు చేశారని మం డిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్ధులకు రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు విన్నవించినట్లు తెలిపారు. కా ర్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేఅరవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.