ఇక 12 గంటలు ఓపెన్
బెల్లంపల్లి శాఖ గ్రంథాలయం ఇక నుంచి ప్రతి రోజూ పన్నెండు గంటలు పని చేయను న్నది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వర కు తెరచి ఉండనున్నది. బెల్లంపల్లి శాఖ కాళోజీ గ్రంథాల యంలో నెలకొన్న సమస్యలపై గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ‘గప్పుడెంట్లుండే..
- బెల్లంపల్లి గ్రంథాలయం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల దాకా తెరిచి ఉంచాలని ఆదేశాలు
- ‘గప్పుడెంట్లుండే.. గిప్పుడెట్లయ్యింది’ కథనానికి స్పందన
- ఉచిత భోజనం, స్టడీ మెటీరియల్ అందించేందుకు ముందుకొచ్చిన ఎన్ఆర్ఐ
- ‘నమస్తే’కు కృతజ్ఙతలు తెలిపిన అభ్యర్ధులు
బెల్లంపల్లి, మార్చి 14 : బెల్లంపల్లి శాఖ గ్రంథాలయం ఇక నుంచి ప్రతి రోజూ పన్నెండు గంటలు పని చేయనున్నది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వర కు తెరచి ఉండనున్నది. బెల్లంపల్లి శాఖ కాళోజీ గ్రంథాల యంలో నెలకొన్న సమస్యలపై గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ‘గప్పుడెంట్లుండే.. గిప్పుడెట్లయ్యింది’ పేరిట కథనం ప్రచురితం కాగా, సంబంధిత అధికారులు స్పందించారు. 12 గంటలు గ్రంథాలయం తెరిచి ఉంచి, పుస్తకాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకో వాలని గ్రంథాలయాధికారి ఉప్పు గోపిని ఆదేశించారు. గురువారం నుంచే పని వేళలు అమలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వీపర్ నీలి రమేశ్, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రంథాలయాధికారి ఉప్పు గోపి, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అటెండర్ ఇరుగురాల శ్రీనివాస్ విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక నుంచి ప్రతి శుక్రవారం, రెండో శనివారం కూడా గ్రంథాలయం కొనసాగనున్నది. గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలను అధికారులు, దాతల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’కు అభ్యర్థులు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు.
ముందుకొచ్చిన ఎన్ఆర్ఐ తోడే వెంకటకృష్ణారెడ్డి
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఎన్ఆర్ఐ బూడిద గడ్డ బస్తీకి చెందిన తోడే వెంకట కృష్ణారెడ్డి స్పందించారు. శని, ఆదివారాలు 70 మంది పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. దాతలు ముందుకు రాని పక్షంలో మిగతా ఐదు రోజులు కూడా భోజనం పెడతానని చెప్పారు. మాజీ కౌన్సిలర్ తోడే వంశీ కృష్ణారెడ్డి స్మారకార్థం స్టడీ మెటీరీయల్ను అందిస్తామని తెలిపారు. రెండేళ్ల కితం తోడే వంశీ కృష్ణారెడ్డి రూ.60 వేల విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందించారు. ఏ సమస్య ఉన్నా చేయూతనందిస్తానని స్పష్టం చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

