వేమనపల్లి, ఆగస్టు 1 : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కుమార్ దీప క్ అన్నారు. గురువారం వేమనపల్లి మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యుడు రాజేశ్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు.
పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్‌కు గ్రామస్తులు సమస్యలు విన్నవించుకున్నారు. డాక్టర్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండ డం లేదని, సరైన వైద్యం అందడం లేదని గ్రామస్తులు కలెక్టర్‌కు తెలిపారు. డాక్టర్, వైద్య సిబ్బంది లేకపోతే ఫొటోలు తీసి తనకు పంపాలని ఆయన గ్రామస్తులకు సూచించారు.
అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. ఇన్చార్జి ఎంపీడీవో ఎక్కడని సిబ్బందిని అడుగగా రాలేదని, బదిలీపై వెళ్లాడని కలెక్టర్‌కు సిబ్బంది సూచించారు. కలెక్టర్ వెంటనే డీపీవోతో మాట్లాడి అధికారిని నియమించాలని ఆదేశించారు. అనంతరం కార్యాలయంలోని ఈజీఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. వన మహోత్సవం లక్ష్యాన్ని పూర్తి చేశారా అని ఏపీవో సత్యప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. 80 వేల మొక్కలు నాటడం లక్ష్యంగా, 90 శాతం పూర్తి చేసినట్లు ఏపీవో కలెక్టర్‌కు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.
ధరణి రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నాయని ఆపరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఎందుకు నిర్మాణం పూర్తి చేయలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేసినట్లు కార్యదర్శి కలెక్టర్‌కు విన్నవించారు. మండల కేంద్రంలో పారిశుధ్యం లోపించిందని, వీధి దీపాలు లేవని కలెక్టర్‌కు గ్రామస్తులు విన్నవించారు.
ఈ విషయమై కలెక్టర్ కార్యదర్శిని ప్రశ్నించగా, గ్రామ పంచాయ తీ ఖాతాలో నిధులు లేవని ఆయన తెలిపారు. అనంతరం వేమనపల్లి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. నాణ్యమైన భోజనం అందించాల ని ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రెడ్డికి సూచించారు. అనంతరం నీల్వాయిలోని ఉన్నత పాఠశాలను సందర్శించి మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఏపీవో పంచాయతీ కార్యదర్శి శ్యామ్, ఏపీవో సత్య ప్రసాద్, ఈసీ మధుకర్ , టీఏ రాంమ్మోహన్, సిబ్బంది ఉన్నారు.
విద్యార్థిని సన్మానించిన కలెక్టర్
నస్పూర్,ఆగస్టు 1: జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచి జపాన్ ఇంటర్నేషనల్ సైన్స్ కార్యక్రమానికి ఎంపికైన జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యాసింగన్ను గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్ ఘనంగా సన్మానించారు. విద్యార్థులు వినూ త్న ఆవిష్కరణలతో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. డీఈవో యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు పాల్గొన్నారు.